Site icon vidhaatha

MLA Malla Reddy | సీఎంను కలుస్తా.. అదృష్టముంటే మళ్లీ మంత్రినైతనేమో

MLA Malla Reddy | విధాత : నేను సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని, నియోజకర్గం అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేముందన్నారు, ఆయన రాష్ట్రానికి సీఎం కదా అని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి రాగా, ఈ కార్యక్రమానికి హాజరైన మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను రేవంత్ రెడ్డి పాతమిత్రులమని, టీడీపీలో కలిసి పనిచేశామన్నారు. కీసర ఆలయ కార్యక్రమాలక సీఎం రేవంత్‌రెడ్డిని పిలిచేందుకు ఆయనను కలుస్తానన్నారు.


ఐదేళ్లలో ఏమైనా జరగొచ్చని, అదృష్టం ఉంటే మళ్లీ నేను మంత్రి కావచ్చేమోనన్నారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్లో అయిందన్నారు. కాంగ్రెస్ గెలవడం వాళ్లకు షాక్ అయితే, ఓడటం మాకు షాక్ అన్నారు. నేను ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయబోనని మరోసారి స్పష్టం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమని మా పార్టీ అధిష్టానం చెబుతుందని, అయితే ఈ టికెట్‌ను తన కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని కోరుతున్నానని, ఎవరు పోటీ చేసిన పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు

Exit mobile version