Site icon vidhaatha

రాజాసింగ్ హౌస్ అరెస్టు.. కేసీఆర్‌-రేవంత్ ఒక్కటే

విధాత : హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రేక్షకపాత వహించడంలో కేసీఆర్‌, రేవంత్ ప్రభుత్వాల పాలనకు తేడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. గురువారం ఆయన చెంగిచర్లలో ఓ వర్గం దాడికి గురైన బాధిత గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఆయనను పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ కేసీఆర్‌, రేవంత్ పాలనకు తేడా లేదని, కేసీఆర్ హయాంలో జరిగినట్లుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటు బ్యాంగు రాజకీయాలతో ఓ వర్గంకు కొమ్ముకాస్తు అన్యాయాలను, దౌర్జన్యాలను పాలకులు ప్రొత్సహించడం సరికాదన్నారు. పైగా బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. హిందువులపై అణిచివేతకు పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.

Exit mobile version