MLA Rekha Naik |
విధాత, బిఆర్ఎస్ తొలి జాబితాలో టికెట్ దక్కని ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ నేడు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నిన్న సోమవారం రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.@revanth_anumula @INCTelangana pic.twitter.com/qBne9XuvtC
— Congress for Telangana (@Congress4TS) August 21, 2023
ఈరోజు రేఖానాయక్ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఎస్టీ సామాజిక వర్గం కు చెందిన తాను ఖానాపూర్ నుండి వరుసగా రెండుసార్లు గెలిచినని మూడోసారి కూడా విజయం సాధిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సింది వస్తుందన్న ఉద్దేశంతోనే తనకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించిందని ఆమె వాపోయారు.
బీఆర్ఎస్ తొలి జాబితాలో టికెట్ దక్కని పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు సైతం త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్ననట్లు తెలుస్తుంది. మరికొందరు టిఆర్ఎస్ రెబల్స్ గా ,ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే రేఖా నాయక్ కన్నీటి పర్యంతం.. భూక్య జాన్సన్ నాయక్ అనుచరుల సంబరాలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కన్నీటి పర్యంతమైంది. మరోవైపు టికెట్ కేటాయించిన జాన్సన్ నాయక్ అనుచరులు బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ అధిష్టానం సిటింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఖానాపూర్ కు తిరిగి వచ్చి విలేకరులతో ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడారు. ఇంకా ఎమ్మెల్యే పదవీ కాలం 50 రోజులు ఉందని.. ప్రజల మధ్యనేఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.
నాకు అన్నదమ్ములు ఎవరూ లేరని, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలే నాకు అన్నదమ్ములని, నా క్యాడరే ఆత్మీయులని తెలిపారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగుతానని పేర్కొన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే ప్రకటించబోనని, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.