Site icon vidhaatha

కాంగ్రెస్ ప్రభుత్వం నేమ్ చేంజర్ మాత్రమే: ఎమ్మెల్సీ కవిత


విధాత, హైదరాబాద్‌: పాత పేర్లు మార్చి కొత్త పెర్లు పెడుతామన్న మాటలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి చిత్తశుద్ధిని చాటేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదని బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శాసన మండలి మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందని అన్నారు. పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెడుతున్నారు తప్ప ఇంకేమి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజర్ మాత్రమేనని, గేమ్ చేంజర్ కాదని బడ్జెట్‌లో తేలిపోయిందన్నారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం సరిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతి గేర్చు మార్చే అంశాలు ఏవి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో లేవన్నారు. ఎన్నికల సందర్భంగా ‘కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నో హామీలను బడ్జెట్ ప్రస్తావించలేదని కవిత ఆరోపించారు. అశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామన్నారని, కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు చూపలేదన్నారు.

Exit mobile version