Site icon vidhaatha

MLC Kavitha | కవిత విచారణకు హాజరుకావాల్సిందే: ఈడీ

Mlc Kavitha |

సుప్రీం విచారణ 26కు వాయిదా

విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది. శుక్రవారం కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. కవితకు కావాలంటే మరో పది రోజుల సమయమైన ఇస్తామని, విచారణకు ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు ఆక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారణకు రావాల్సిందంటూ మరోసారి ఈడీ జారీ చేసిన నోటీసులపై సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు కవిత శుక్రవారం ప్రగతి భవన్‌కు వెళ్లారు. పార్టీ లీగల్ టీంతో చర్చించి ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై వారు చర్చించనున్నారు.

Exit mobile version