Site icon vidhaatha

MLC KOTIREDDY | సాగర్‌లో MLC కోటిరెడ్డి ‘బలగం’.. భారీ కాన్వాయ్‌తో హల్చల్

విధాత: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటిరెడ్డి నియోజకవర్గం ప్రజల్లో వేగంగా తన బలగాన్ని పెంచుకుంటు దూసుకుపోతున్నారు. శుక్రవారం రాత్రి గుర్రంపొడ్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన కోటిరెడ్డి 100కు పైగా కార్ల కాన్వాయ్‌తో భారీ ఊరేగింపుతో వెళ్లి హల్చల్ చేశారు.

రాత్రివేళ కళ్లు చెదిరిపోయేలా సాగిన ఆయన కాన్వాయ్ దగదగలను జనం అబ్బురంగా చూశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తదుపరి ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో ప్రజా బలం దండిగా ఉన్నప్పటికీ కోటిరెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేకపోయింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవితో ఆయనను గౌరవించింది.

రానున్న ఎన్నికల్లోనైనా సాగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కోటిరెడ్డి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కు పోటీగా పార్టీ బలగం, ప్రజాబలంతో దూసుకెళ్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఏదో ఒక కార్యక్రమాలతో సందడి చేస్తున్న కోటిరెడ్డి గుర్రంపొడుకు భారీ కాన్వాయ్‌తో వచ్చిన తీరును చూసిన జనం పార్టీ శ్రేణులు ఆయనకు డప్పు చప్పుళ్లతో, బాణసంచా మోతలతో భారీ స్వాగతం పలికారు.

Exit mobile version