Site icon vidhaatha

Nalgonda: ‘దుబ్బాక’ సేవ.. కానిస్టేబుల్ అభ్యర్థులకు మాక్ టెస్ట్

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహ రెడ్డి తన ప్రజాసేవ కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ కానిస్టేబుల్స్ ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మెగా మాక్ టెస్ట్, అకెళ్ల రాఘవేంద్రరావుతో మోటివేషన్ క్లాసులు నిర్వహించారు.

శనివారం జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్లో దుబ్బాక అమరేందర్ రెడ్డి ట్రస్టు ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దుబ్బాక మాట్లాడుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు మాక్ టెస్ట్, మోటివేషన్ క్లాసులు నిర్వహించినట్లు తెలిపారు.

యువత ఆశావాహ దృక్పథంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ నేత పున్న కైలాష్, స్థానిక వైస్ ఎంపీపీ జిల్లెల పరమేష్, బొంత వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version