Site icon vidhaatha

Viral Video | అసలే బ్లాక్‌ కోబ్రా.. తోకతో కోతి సయ్యాటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Viral Video | సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయపెడుతుంటాయి. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, పాములు, ఇతర జంతువులకు సంబంధించి వీడియోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి.

RGV – Ashu Reddy | అషురెడ్డి పాదాలను ముద్దాడిన ఆర్జీవీ.. వీడియో వైరల్‌..!

తాజాగా బ్లాక్‌ కోబ్రాతో ఓ కోతి సయ్యాటలు ఆడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పొలంలో ఓ భారీ రాచనాగు పాము ఉండగా అటువైపుగా వెళ్తున్న ఓ కోతి దాన్ని చూసి దగ్గరకు వెళ్లగా.. పడగ విప్పి బుసలు కొట్టింది.

అయినా కోతి బెదరకుండా దాని ఎదుటకు వెళ్లింది. కోబ్రా బుసలు కొడుతూ కోతిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. చాకచక్యంగా తప్పించుకుంది. కోతి అంతటితో ఆగకుండా తోక పట్టుకొని లాగుతూ ఆటలాడింది.

ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘1980లో విడుదలైన ఒక పాత సినిమా (స్నేక్ ఇన్ ది మంకీస్ షాడో) గుర్తుకు వచ్చింది’ గుర్తుకు వచ్చింది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. చిలిపి కోతి అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు.

Exit mobile version