Monkeys | ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించని వారు ఎవరైనా ఉంటారా? అంటే ఊహించుకోవడమే కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌ను విరివిగా వాడేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొంటే వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్‌ను అలవోకగా వాడేస్తున్నారు.
ఆ మాదిరిగానే కోతులు కూడా స్మార్ట్ ఫోన్‌తో ఆడుకున్నాయి. మనషుల మాదిరిగానే స్మార్ట్ ఫోన్‌ను కోతులు స్క్రోల్ చేశాయి. తమ ముఖాలు కనిపిస్తున్న ఆ స్క్రీన్‌ను చూసి కోతులు చాలా సంబుర పడిపోయాయి.
ఓ కోతి అయితే ఆ ఫోన్‌ను ఆపరేటింగ్ చేసేందుకు చాలా ఆసక్తి చూపింది. ఫోన్‌ను ఆపరేటింగ్ చేసిన కోతుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. డిజిటల్ లిటరసీ అవేర్‌నెస్.. అన్‌బిలివబుల్ లెవల్‌కు చేరింది.. అని పేర్కొన్నారు.