Moon Venus Conjunction | ఆకాశంలో శుక్రవారం రాత్రి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రుడు, శుక్రగ్రహం ఒకే దగ్గరకు చేరుకున్నాయి. ఈ ఖగోళ వింత అందరినీ కనువిందు చేసింది. చంద్రుడి కింద ప్రకాశవంతమైన నక్షత్రం మెరుస్తూ కనిపించింది. అయితే, నక్షత్రం కాదని శుక్ర గ్రహమని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
రెండు అత్యంత దగ్గర కనిపించడం చాలా తక్కువ సమయాల్లో మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుందని పేర్కొన్నారు. నవ్వుతున్నట్లుగా ఉన్న అర్ధ చంద్రుడికి దిగువన సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం వీనస్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
వీనస్ భూమికి 185 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందని జాతీయ అవార్డు గెలుచుకున్న సైన్స్ బ్రాడ్‌కాస్టర్ సారిక తెలిపారు. మైనస్ 3.98 డిగ్రీల కోణంలో కనిపించిందని, కాగా, శుక్రుడికి చంద్రుడు 3 లక్షల 79 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
ఈ సమయంలో చంద్రుడు పది శాతం ప్రకాశంతో కనిపించాడని, చంద్రుడు- శుక్రుడి మధ్య భారీగా దూరం ఉన్న భూమి నుంచి చూసిన సమయంలో జంటగా కనిపించిందని సారిక పేర్కొన్నారు. ఈ అరుదైన సంయోగం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపించినట్లుగా పేర్కొన్నారు.
శుక్రడు సౌరవ్యవస్థలో ప్రకాశవంతమైన గ్రహాల్లో ఒకటి. ఎందుకంటే ఇది సూర్యుని కాంతిలో 70శాతం తిరిగి ప్రతిబింబిస్తుంది. అలాగే ఇది భూమికి దగ్గరగా ఉన్న గ్రహం.