- నా జోలికి రాకండి..మీ చరిత్ర చదివించుకోకండి
- రేవంత్ రెడ్డి పాలన ఔరంగజేబ్ పాలనగా ఉందంటు ఫైర్
- ఎంపీ ధర్మపరి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
విధాత : దివంగత సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డిని చంపింది ఎవరో నాకు తెలుసని, కాంగ్రెసోళ్లు నా జోలికి రావద్దని, నేను గౌరవిస్తానని, అనవసరంగా నన్ను గెలికి మీ చరిత్ర చదివించుకోకండని బీజేపీ నిజాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమురం భీమ్ బీజేపీ రథయాత్రలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజవర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు.
మీరెంత చరిత్ర హీనులే డీ. శ్రీనివాస్ కొడుకుగా నాకంటే ఎవరికెక్కువ తెల్వదని, చిన్నప్పటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు.. నేను మిమ్మల్ని చూస్తున్నానని, కాంగ్రెస్‌ను నిన్నమొన్నటి దాకా నేను ఏం అనలేదని, నాజోలికొస్తే మీ చరిత్ర చదవక తప్పదని హెచ్చరించారు.
బీఆరెస్ హయాంలో మొన్నటిదాకా శివాజీ విగ్రహం ర్యాలీలను చేయనిచ్చారని, కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చి శివాజీ విగ్రహాల వద్ద పోలీసులను పెట్టారని, దండవేసి వెళ్లిపోవాలని ఆంక్షలు పెట్టారని, ర్యాలీకి అనుమతివ్వలేదని, అదే ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ర్యాలీకి ఆరు గంటల పర్మిషన్ ఇచ్చారని విమర్శించారు. కమిషనర్‌ను అడిగితే మేం అనుమతి ఇవ్వలేదని, మా ర్యాలీకి పర్మిషన్ ఇస్తామని ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి పాలన మరీ ఔరంగ్ జేబ్ పాలనగా ఉందని మండిపడ్డారు.
దేశంలో బీజేపీ వాళ్లు హిందు ధర్మాన్ని కాపాడుతున్నారని,. హిందూ ధర్మం బలంగా ఉన్నందునే వీదేశీ మూకల ఆటలు సాగడం లేదన్నారు. హిందుస్తాన్‌తో పెట్టుకుని పాకిస్తాన్ బిచ్చమెత్తుకుంటుందని, ధర్మంతో సాగుతున్న హిందుస్తాన్‌తో పెట్టుకుంటే ఎవరికైనా అదే గతిపడుతుందన్నారు. చైనాకు పోయి ఫ్యాక్టరీలు పెడుతామన్నోళ్లు కూడా భారత్ దేశంకు వస్తున్నారన్నారు.