Site icon vidhaatha

MP Bandi Sanjay: మైనార్టీ యువతి పెళ్లికి రూ.50 వేల సహాయం.. ఎంపీ బండి సంజయ్ దాతృత్వం..

MP Bandi Sanjay’s generosity

విధాత కరీంనగర్ బ్యూరో: బిజెపి(BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్(MP Bandi Sanjay) కుమార్ నిరుపేద మైనార్టీ యువతి వివాహానికి రూ.50, 000 ఆర్థిక సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ పట్టణం గోదాం గడ్డకు చెందిన మహ్మద్ సాదిక్ పాన్ షాప్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

సాదిక్ కుమార్తె కు ఇటీవల వివాహ(Marriage) సంబంధం కుదిరింది. కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం సాదిక్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలుసుకున్న బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ సమస్యను ఎంపీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ సంజయ్ కుమార్ సాధిక్ కుమార్తె వివాహ ఖర్చుల కోసం 50 వేల రూపాయల నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు సమీ పర్వేజ్, జిల్లా మైనారిటీ నాయకుడు అజీమ్ సిద్ధికి తదితరులు సాదిక్ పాషా ఇంటికి వెళ్లి అందించారు.

Exit mobile version