- పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఆర్. దామోదర్ రెడ్డి
- రైతు దీక్షలో వెంకన్న దామన్న ఉమ్మడి గళం
విధాత: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తేనే రైతు రాజ్యం ఏర్పడుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో మాజీమంత్రి ఆర్.దామోదర్ రెడ్డితో కలిసి వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించి ప్రభుత్వం నుండి పరిహారం ఇప్పించేందుకు పోరాడుతామని భరోసానిచ్చారు.
అనంతరం తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో ఎంపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉడకల వానతో పంటలు దెబ్బతిన్న రైతుల కష్టనష్టాలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు. దేశంలో రైతు రాజ్యం తెస్తానని తాను పెద్ద రైతులని చెప్పుకునే సీఎం కేసీఆర్ గురజాల వానతో మంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు.
రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అన్ని రుణాలు మాఫీ చేసిందన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలేదన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులకు న్యాయం చేస్తున్నాడని, ఆయనను చూసైనా నేర్చుకోవాలన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని రైతు రాజ్యం ఏర్పడుతుందన్నా రు. రైతులకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో క్వింటాలు కు 2800 రూపాయల మద్దతు ధర ఇస్తున్నారని, త్వరలో 3000 చేయనున్నారన్నారు. కానీ మన రాష్ట్రంలో 1500 కూడా రావడం లేదన్నారు.
సాగు వ్యయం పెరిగినా తెలంగాణ రైతులకు మద్దతు ధర పెరగడం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మాదిరిగా క్వింటాలకు 3000 రూపాయల మద్దతు ధర లభించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెడతామన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పొడిచాడు శ్రీకాంత్ ఆచారి బలిదానంతో ఆర్. దామోదర్ రెడ్డి, తాను తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు ఉదృతం చేశామని, తాను మంత్రి పదవికి రాజీనామా చేసి నల్లగొండలో ఆమరణ దీక్ష చేపట్టానన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు రాష్ట్ర సాధనకు కొట్లాడామని కేసీఆర్ కుటుంబం కోసమో, ప్రగతి భవన్ కోసమో, ఫామ్ హౌస్, కొత్త సెక్రెటరీల కోసమో కాదన్నారు.
ఏం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్ల అవినీతి చేసి మల్లన్న సాగర్‌తో రైతుల భూములు లాక్కొని తన ఫామ్ హౌస్కు నీళ్లు మళ్లించు కుంటూ ఎకరాకు కోటి రూపాయల పంట పండిస్తున్నానని చెబుతూ వందల కోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ కాలంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు ప్రాజెక్టులు, కాలువలు, ఎత్తిపోత పథకాలు, ఊరురా సబ్ స్టేషన్లు నిర్మించామని, కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.
వడగళ్ల వాన రైతులకు ప్రభుత్వంతో కొట్లాడి పరిహారం ఇప్పించలేని మంత్రి జగదీష్ రెడ్డి సొంత ఊరులో పెద్ద బంగళా మాత్రం కట్టుకున్నారన్నారు. వేలకోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ పథకంతో మంత్రి స్వగ్రామం నాగారంలోనే మంచిరెడ్డి సరఫరా కావడం లేదన్నారు.
అక్కడ మంచినీటి సరఫరా జరిగినట్లు నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. నాగారం పాఠశాలకు తాను వాటర్ ప్లాంట్ ఇస్తే ఆయన మనుషులు పెట్టనివ్వలేదన్నారు. పకృతి వైపరీత్యాలతో కష్టనష్టాల పాలన రైతులు ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దని కష్టాల్లో ఉన్న రైతులు తనను సంప్రదిస్తే చేతనైనంత సహాయం చేస్తానన్నారు.
పంట నష్టం వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అరకొర నమోదు చేసి బాధిత రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. వరి రైతులకు ఎకరాకు 50 వేలు, మిర్చి కూరగాయల రైతులకు, తోటల రైతులకు లక్ష చొప్పున పరిహారం అందించాలన్నారు.
పంట నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీకి వాటి వివరాలను అందిస్తానని, కేంద్ర పరిహారం మంజూరుకు ప్రయత్నిస్తానన్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పంట నష్టం పాలైన రైతులను ఆదుకుంటానని ముందుకు రాలేదని మంత్రి పదవి ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నారు.
పోలీస్ రక్షణ లేకుండా తిరిగితే ఈ మంత్రులను, ఎమ్మెల్యేలను ఎవరు జనంలో తిరగనివ్వరన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇసుక దందా చేస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. పారదర్శకంగా ఉండాల్సిన జిల్లా ఎస్పీ జిల్లా మంత్రికి జిందాబాద్ లు కొట్టడం విడ్డూరమన్నారు. ఇసుక అక్రమ రవాణా తో భూగర్భ జలాలు అడుగంటి కరువు పరిస్థితులు ఎదురవుతాయని, గ్రామాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజలు ఆవేదన చెందడం మాని తిరగబడి ఇసుక లారీలను ధ్వంసం చేస్తే మళ్లీ ఇటువైపు రావన్నారు.
మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వడగళ్ల వానతో తిరుమలగిరి మండలంలో వేల ఎకరాల్లో పంటలు నష్టపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత రైతాంగానికి భరోసానిచ్చేందుకు ఈరోజు పర్యటించి రైతు దీక్ష చేపట్టామన్నారు. మిర్చి, కూరగాయలు పండించిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు, వరి రైతులకు కనీసం 50 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నాయకులు చెవిటి వెంకన్న, చిరంజీవి, నరసయ్య జ్ఞాన సుందర్, డాక్టర్ రవి, నాగరిప్రీతం, తదితరులు పాల్గొన్నారు. ఈ రైతు దీక్ష కార్యక్రమానికి మొదటినుండి పార్టీలో పరస్పరం గిట్టని వెంకటరెడ్డి దామోదర్ రెడ్డిలు కలిసి పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణు లో ఉత్సాహం నింపింది. అయితే స్థానిక కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి వర్గీయుడైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాత్రం వీరి పర్యటనకు దూరంగా ఉన్నారు.