Site icon vidhaatha

Nalgonda: వీడిన మిస్సింగ్ కేసు మిస్టరీ.. హత్యకు గురైన న‌గేష్‌

Nagesh who was murdered

విధాత: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామంలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఎర్రగోర్ల నగేష్(Erragorla Nagesh) (25) కనిపించడం లేదని ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో(Police Station) ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నగేష్ కాల్ డేటా(call data) ఆధారంగా విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఉన్న కంచికంట్ల శ్రీను(Kanchikantla Shrinu)ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా కేస్ మిస్టరీ(mystery) వీడింది. శ్రీను ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంకు నుండి నగేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. నగేష్‌ను అక్రమ సంబంధం నేపథ్యంలో శ్రీను హత్య చేసి తన ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పడవేసినట్లుగా భావిస్తున్నారు.

Exit mobile version