విధాత: నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో ఎల్లుండి ఫిబ్రవరి 21 నుంచి శనివారం 26 ఫిబ్రవరి సాయంత్రం 5గంటల వరకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ రమణచారి తెలిపారు.
వార్డుల వారీగా దరఖాస్తుల స్వీకరణకు 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3, 4 వార్డులకు కలిపి ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా, అందిన దరఖాస్తులపై వెనువెంటనే విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలతో 12 ఎంక్వైరీ టీమ్‌లను ఆర్డీవో జయచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గృహ నిర్మణా శాఖ వారు రూపొందించిన దరఖాస్తు ఫారాలను మాత్రమే ఉపయోగించి దరఖాస్తులు చేయాలని, అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచనున్నట్లుగా కమిషనర్ తెలిపారు.