Site icon vidhaatha

Nalgonda | లోక్ అదాలత్‌లో 17, 433 కేసుల పరిష్కారం

Nalgonda

విధాత: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శనివారము నల్లగొండ జిల్లా కోర్టు అవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 17, 443కేసులు పరిష్కరించడం విశేషం. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 22 సివిల్ కేసులు, 11,142 క్రిమినల్ కేసులు, బ్యాంక్ రికవరికి, ట్రాన్స్కో విద్యుత్ శాఖ కు సంబంధించిన 6150 ప్రిలిటిగేషన్ కేసులను, 119 మోటారు వాహన ప్రమాద బీమా కేసులను పరిష్కరించారు. మొత్తం 17,433 కేసులు పరిష్కారమయ్యాయి. భీమా కంపనీలు 4,36,66,500 లను బాధితులకు నష్టపరిహారంగా అందచేశారు.

నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా సదన్ సంస్థ అధ్యక్షులు ఎం. నాగరాజు లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల ప్రాంగణములలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తునట్లు, రాజీకి అర్హమైన కేసులను కక్షిదారులు పరిష్కరించుకొని, తమయొక్క విలువైన సమయాన్ని, డబ్బును ఆదాచేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. దీప్తి, రెండవ అదనపు జిల్లా జడ్జి బి.తిరుపతి, మేజిస్ట్రేట్స్ కే.శిరీష, కె.శ్రీవాణి, కుమారి కె.సౌందర్య, న్యాయవాద సంఘం అధ్యక్షులు నేతి రఘుపతి, న్యాయ సేవాధికార సంస్థ నామినేటెడ్ సభ్యులు, ఇతర న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.

Exit mobile version