Site icon vidhaatha

నల్గొండ: ఈత కొట్టేందుకు వెళ్లి.. కాలువలో పడి విద్యార్థి దుర్మరణం

విధాత: నల్గొండ పట్టణంలో షేక్ ఇమ్రాన్ అనే తోమ్మిదవ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు ఏఎమ్మాఆర్పీ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు కాలువలోకి దిగారు. ఇమ్రాన్‌కు ఈత రాకపోవడంతో అతను నీటిలో మునిగి చనిపోయాడు.

భయపడిన స్నేహితులు విషయాన్ని ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు తెలపలేదు. ఇమ్రాన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ గుర్తించి కాలువలో మునిగి చనిపోయిన ఇమ్రాన్ మృతదేహాన్ని కాలువలో కొద్దీ దూరంలో గుర్తించారు.

సోమవారం ఉదయం వెలికి తీశారు. వన్ టౌన్ సీఐ గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాక పోవడంతోనే ఇమ్రాన్ మృతి చెందినట్లుగా తెలిపారు.

Exit mobile version