Site icon vidhaatha

Warangal: నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం.. ములుగు జిల్లాకు రూ.76 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్ర‌భుత్వ పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌క‌టించిన నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం పొందిన ములుగు జిల్లాకు రూ.76 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి లభించనున్నది. ములుగు జిల్లా దేశంలో 2వ స్థానం, రాష్ట్రంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది.

మంత్రుల అభినందనలు

ములుగు జిల్లా క‌లెక్ట‌ర్‌, అధికారులు, సిబ్బంది, ప్ర‌జాప్ర‌తినిధులను మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ అభినందించారు. హ‌నుమంకొండ‌ హ‌రిత హోట‌ల్ లో శనివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రులు మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ముందు చూపుతో చేపట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం వ‌ల్ల గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని సాధించార‌ని అన్నారు.

ములుగు జిల్లాతోపాటు, గ్రామ‌, మండ‌ల, రాష్ట్ర స్థాయిల్లోనూ 13 అవార్డులు వ‌చ్చాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మేల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ములుగు ఇన్ చార్జీ క‌లెక్టర్‌, భూపాలపల్లి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేష్ మిశ్రా పాల్గొన్నారు.

Exit mobile version