Site icon vidhaatha

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు

విధాత‌: మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే నారాయణను పోలీసులు అరెస్టు చేశారు.

ఆయనకు అప్పుడే బెయిల్ మంజూరు అయింది. తాజాగా చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. బెయిల్ రద్దు చేసిన కోర్టు నారాయణ నవంబర్ 30 లోపు హాజరు కావాలని ఆదేశించింది.

కాగా.. సోమవారం సాయంత్రం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల మాజీ అధినేత నారాయణకు చిత్తూరు జిల్లా న్యాయస్థానం బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షల సమయంలో నేల్లెపల్లి జడ్పీ హైస్కూల్ లో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 27వ తేదిన Cr. No. 111/2022 u/s 5 r/w 8, 10 కింద 408, 409, 201, 120 –B IPC & Sec. 65 సెక్ష‌న్లు కింద‌ కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నారాయణ విద్యా సంస్థలలో పని చేసే సిబ్బంది 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.

Exit mobile version