SURYAPETA: గంజాయి, డ్రగ్స్ నివారించడానికి నార్కోటిక్ డాగ్

రిహార్స‌ల్స్‌లో అద‌ర‌గొట్టిన రోలెక్స్.. అభినందించిన ఎస్పీ విధాత: సూర్యాపేట జిల్లా పరిధిలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీస్ శాఖ కేటాయించిన పోలీస్ జాగిలం డాగ్ రోలెక్స్(పోలీస్ జాగిలం) రిహార్సల్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS పరిశీలించారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలు గుర్తించి పట్టుబడి చేయడానికి జిల్లాకు నార్కోటిక్ డాగ్‌ను కేటాయించడం జరిగిందని తెలిపారు. డాగ్ పేరు రోలెక్స్ అని ఈ రోలెక్స్ జాగిలం ఎలా పని […]

  • Publish Date - February 24, 2023 / 12:47 PM IST

  • రిహార్స‌ల్స్‌లో అద‌ర‌గొట్టిన రోలెక్స్..
  • అభినందించిన ఎస్పీ

విధాత: సూర్యాపేట జిల్లా పరిధిలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీస్ శాఖ కేటాయించిన పోలీస్ జాగిలం డాగ్ రోలెక్స్(పోలీస్ జాగిలం) రిహార్సల్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS పరిశీలించారు.

అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలు గుర్తించి పట్టుబడి చేయడానికి జిల్లాకు నార్కోటిక్ డాగ్‌ను కేటాయించడం జరిగిందని తెలిపారు. డాగ్ పేరు రోలెక్స్ అని ఈ రోలెక్స్ జాగిలం ఎలా పని చేస్తున్నది అనే దానిపై డాగ్ హ్యండిలర్ నిర్వహించిన రిహార్సల్‌ను పరిశీలించామన్నారు. రిహార్సల్‌లో భాగంగా బ్యాగ్స్ లలో, బస్సులో, భూమిలో, మనిషి వద్ద దాచి ఉంచిన గంజాయిని డాగ్ గుర్తించడం జరిగిందన్నారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ లను అరికట్టి ట‌న్నులకొద్దీ గంజాయిని సీజ్ చేయడం కూడా జరిగిందన్నారు. గంజాయి నివారణలో ఉక్కు పాదం మోపడంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖకు నార్కోటిక్ డాగ్ ను కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల, కృష్ణా తీరం వెంట ఉన్న సూర్యాపేట జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ నివారణలో అలెక్స్ డాగ్ ఉపయోగపడుతుందన్నారు. ప్రయోగ పరీక్షల్లో డాగ్ రోలెక్స్ గంజాయిని గుర్తించడం అభినందనీయం అని ఎస్పీ అన్నారు.

ఎస్పీ వెంట DSP లు నాగభూషణం, రవి, వెంకటేశ్వర రెడ్డి, CI లు శ్రీనివాస్, సోమ్ నారాయణ్ సింగ్, ఆంజనేయులు, ప్రసాద్, గౌరీ నాయుడు, RI లు శ్రీనివాస రావు, శ్రీనివాస్, గోవిందరావు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు.

Latest News