Site icon vidhaatha

Lok Adalat | నేడే జాతీయ లోక్ అదాలత్‌

Lok Adalat |

విధాత‌, హైద‌రాబాద్: ఎన్‌ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనిల్, సివిల్ కేసుల్లో రాజీ కోసం నేడు (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) సభ్య కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఫిజికల్‌గా, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

హైకోర్టుతో పాటు తాలూకా కోర్టుల్లోనూ ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కేసులను పరిష్కరించుకోవాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, న్యాయసేవా సదన్, మండల న్యాయసేవా కమిటీలను సంప్రదించాలని.. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని ఆయ‌న తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మార్గదర్శకాల మేరకు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన వెల్లడించారు.

Exit mobile version