Site icon vidhaatha

ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలు ఇవే..

విధాత : దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలు కేవ‌లం 8 మాత్ర‌మే.
2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. 54 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించాలి. దీంతో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

జాతీయ పార్టీలు..
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)
భారతీయ జనతా పార్టీ (BJP)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – (CPI)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – (CPM)
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)
బహుజన్ సమాజ్‌ పార్టీ (BSP)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)
నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)

Exit mobile version