విధాత: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కేబినెట్ లో మార్పులు చేయబోతున్నారని సమాచారం. ఈసారి శాసనమండలి నుంచి కొందరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.వాస్తవానికి జగన్ (YS Jagan Mohan Reddy)అధికారంలోకి వచ్చాక 2019లో ఏర్పాటు చేసిన కేబినెట్‌ను రెండున్నరేండ్ల తరువాత విస్తరించారు.
కొడాలి నాని.. పేర్ని నాని.. పుష్ప శ్రీవాణి వంటి కొందరిని తప్పించారు. గుడివాడ అమర్నాథ్ వంటి జూనియర్లను.. తొలిసారి గెలిచినవాళ్లను మంత్రులుగా తీసుకున్నారు. ఇక గుడివాడ అమర్ అయితే తన శాఖమీద ఏమాత్రం పట్టు లేక సోషల్ మీడియాను దొరిపోతున్నారు. తరచూ అడ్డందిడ్డం కామెంట్లు చేసి
అబాసుపాలవుతున్నారు.
ఎన్నికలకు వెళ్లాల్సిన సమయంలో నాన్ సీరియస్ వాళ్ళను తప్పించి కాస్త ప్రొఫెషనల్ గా స్ట్రాంగ్ వాళ్ళను కేబినెట్లో చేర్చుకుంటే బావుంటుందని జగన్ భావిస్తున్నారు.
ఇక గెలిచిన తొలిసారి మంత్రి అయిన సేదిరి అప్పలరాజుకు ఉద్వాసన తప్పదని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి గెలిచిన అప్పలరాజు మంత్రిగా ఉంటూ పార్టీని పట్టించుకోవడం లేదని జగన్ దగ్గర రిపోర్ట్ ఉందని అంటున్నారు.
అప్పట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించి ఆయనకు సామాజికవర్గం అని చాన్స్ ఇచ్చారు. కానీ అప్పలరాజు పార్టీకి పెద్దగా ఉపయోగపడడం లేదని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంటున్నారు. కొత్తగా ఎమ్మెల్సీలు అవుతున్న వారిలో కొందరు మంత్రులుగా రావచ్చని సమాచారం.