Site icon vidhaatha

CM Revanth Reddy: ఆరు గ్యారంటీలకు కాదు..అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులడుగుతున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరీకి సంబంధించి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా చిట్ చాల్ లో మాట్లాడారు. నేను ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదని..
ఆర్ఆర్ఆర్, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నానని గుర్తు చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించడంతో రాష్ఱ్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు.

గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉందని..ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎవరో తెలియకుండానే..వారు నన్ను పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రిగా చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో మేం ప్రవేశపెట్టినన్ని పాలసీలు, పథకాలు ఎవరూ చేయలేదన్నారు.

తెలంగాణాకు రూ. 2.2 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని, నిరుద్యోగిత రేటు 8.8% నుంచి 6.1% శాతానికి తగ్గించామని వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని..ప్రతిపక్ష నేతగా, పదేళ్ల పాటు రాష్టాన్ని పాలించిన వ్యక్తిగా బాధ్యతతో అసెంబ్లీలో చర్చలకు రావాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Exit mobile version