Site icon vidhaatha

ఏపీ: పోలీసు శాఖలో 6,511 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6,511 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల నియామకాలకు సీఎం జగన్ అంగీకరం తెలిపారు. 2,520 స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లు, 3,580 సివిల్ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

రిజర్వ్ ఎస్‌ఐలుగా 96 మంది, సివిల్ ఎస్‌ఐలుగా 315 మంది నియామకాలకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర‌స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవో నెం.153ని జారీ చేసింది.

Exit mobile version