Site icon vidhaatha

OBC Student Movements | ఓబీసీ విద్యార్ధి ఉద్యమాలకు మద్దతు: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

OBC Student Movements

విధాత: ఓబీసీ స్టూడెంట్స్ చేసే ఉద్యమాలకు అండగా ఉండి ఓబిసి సమస్యలపై జాతీయస్థాయిలో పోరాటాలకు పూర్తి మద్దతు ఇస్తానని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కుల గణన మరియు ఓబీసీ సమస్యలపై జరిగిన జాతీయ సదస్సులో తెలియజేశారు.

ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని ఢిల్లీలో ఓబీసీల కోసం భవనాలు మరియు విద్యార్థుల కోసం ఓ బి సి హాస్టల్ లను పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు ఓబీసీ పోరాటాలలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో తమిళనాడు మోడల్ లెక్క బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యసభ సభ్యులు డీఎంకే నాయకుడు పీ. విల్సన్ గారు పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి ఏఐసీసీ సెక్రెటరీ వి. హనుమంతరావు , డాక్టర్ చందన్ యాదవ్ , టిఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ దాసోజు శ్రావణ్, ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ జి. కరుణానిధి, గుజరాత్ లో ఓబీసీ సమస్యలపై పోరాడుతున్న గడావి, కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వెంకటేష్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ బీననేని, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జి. కిరణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ అరుణ్ కేతన్, గీతిక ట్రెజరర్ కొండల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రావణ్, జనరల్ సెక్రెటరీ రాకేష్ దత్త, శివ యాదవ్, వెంకట దాసు మాట్లాడారు.

సమావేశంలో జాతీయస్థాయిలో ఓబీసీ సమస్యల మీద డిక్లరేషన్ ని విడుదల చేశారు. ఓబిసి డిక్లరేషన్ను ఢిల్లీ స్థాయిలో అన్ని పార్టీలకు ఓబిసి డిక్లరేషన్ను సమర్పించి జాతీయస్థాయిలో ఉద్యమాలను బలోపేతం చేస్తావని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. దేశంలోని కేంద్ర విద్యాలయాలు నుండి వచ్చిన విద్యార్థులు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version