Site icon vidhaatha

Heart Attack | వరంగల్ బస్టాండ్‌లో వృద్ధుడికి గుండెపోటు.. CPR చేసినా దక్కని ప్రాణాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) బస్టాండ్ ఆవరణలో వృద్ధుడికి అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack) వచ్చింది. అక్కడ ఉన్న ఓ వైద్య విద్యార్థిని, ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించి సీపీఆర్ (CPR) చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ (Warangal) బస్టాండ్ ఆవరణలో వృద్ధుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని ట్రాఫిక్ సీఐ బాబులాల్ (CI Babulal) కి సమాచారం అందించగా, బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రామారావు (SI Rama Rao0ను మరియు సిబ్బందిని తక్షణమే సంఘటన స్థలానికి పంపించారు.

అక్కడ ఉన్న ఓ వైద్య విద్యార్థిని, ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించి అత్యవసర చికిత్స నిమిత్తం సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షలు చేసి వృద్ధుడి ఎంజీఎం తరలించారు. అయితే వృద్ధుడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇదిలా ఉండగా బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు ప్రాణాల కోసం శ్రమించిన వైద్య విద్యార్థినిని, ట్రాఫిక్ పోలీసులు చేసిన పనిని కొనియాడారు.

Exit mobile version