CM KCR | 19, 20 తేదీల్లో.. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన

CM KCR | విధాత: సీఎం కేసీఆర్ ఈనెల 19, 20 తేదీలలో మెదక్, సూర్యాపేట జిల్లాలో పర్యటించినున్నారు. ఈనెల 19వ తేదీ శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. నిర్మాణం పూర్తి చేసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం కేసీఆర్ […]

  • Publish Date - August 12, 2023 / 04:37 PM IST

CM KCR |

విధాత: సీఎం కేసీఆర్ ఈనెల 19, 20 తేదీలలో మెదక్, సూర్యాపేట జిల్లాలో పర్యటించినున్నారు.
ఈనెల 19వ తేదీ శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

అదే సందర్భంలో.. నిర్మాణం పూర్తి చేసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

ఈ నెల 20వ తేదీ ఆదివారం కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

అనంతరం సూర్యాపేట జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది.

అనంతరం సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

Latest News