- శివాలయాలకు పోటెత్తిన భక్తజనం
- వేడుకగా మహాశివరాత్రి ఉత్సవాలు
- కాళేశ్వరం, వేయిస్తంభాలగుడి, రామప్ప, పాలకుర్తి, కురవి, మెట్టుగుట్ట శివాలయాల్లో వేడుకలు
- వీఐపీల తాకిడితో భక్తులకు ఇబ్బంది
- వసతుల ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్ళింపు
- ఆలయాలకు మహర్ధశ: మంత్రి ఎర్రబెల్లి
ఓరుగల్లు శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో మహాశివరాత్రి (Maha siva rathri) ఉత్సవ శోభతో కళకళలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు (Temples)పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. వందల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కిటకిటతో ప్రధాన ఆలయాల్లో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉప్పొంగిన భక్తి పారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా (warangal) పరిధిలోని కాళేశ్వరం, వేయి స్తంభాల గుడి, సిద్దేశ్వర గుండం, పాలకుర్తి, ములుగు రామప్ప,కురవి, మెట్టుగుట్ట, ఖిలావరంగల్ (Fort warangal)స్వయంభూ దేవాలయం, కోటిలింగాల, కాశిబుగ్గతో పాటు చిన్నాపెద్దా శివాలయాలు, ఇతర దేవాలయాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు సాగుతున్నాయి.
భక్తులతో పాటు విఐపిల(Vip) తాకిడి
శివాలయాలకు భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా బాగానే ఉంది.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా హనుమకొండలోని చారిత్రక కట్టడమైన రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో (Thousand pillers temple) మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు మహా వైభముగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ , గంగు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో వేడుకలు సాగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి, చీఫ్‌విప్ దాస్యం వినయ్ దంపతులు దర్శించుకున్నారు.
ఉదయమే పాలకుర్తి (palakurthy)సోమేశ్వర స్వామి దేవాలయంలో మంత్రులు ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.
మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే (Mla) ఆరూరి రమేష్ దంపతులు, కొత్తగూడ మండలం గుండంపల్లిలోని పురాతన శివాలయంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
పర్వతగిరి, అయినవోలు, కురవి దేవాలయాల్లో శివకళ్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కాలేశ్వరం ముక్తేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ములుగు రామప్ప (Ramappa)రామలింగేశ్వర దేవాలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది.
భక్తుల ఉపవాసం, జాగారం
ఉపవాసం ప్రారంభించిన భక్తులకు పూజలు చేసి, భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఉపవాసంతో పాటు రాత్రంతా జాగారం చేయనున్నారు. ఆదివారం తెల్లవారుజాము వరకు శివాలయాలు భక్తుల దర్శనాలతో కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం, వేయిస్తంభాల దేవాలయాల వద్ద దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. శనివారం శని త్రయోదశి, మహాశివరాత్రి కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది.
దేవాలయాల వద్ద భారీ ఏర్పాట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాలేశ్వరం (Kaleshwaram) ముక్తేశ్వర స్వామి, వేయి స్తంభాల గుడిలో శంబులింగేశ్వరుడు, పాలకుర్తి లోని సోమేశ్వర దేవాలయం, రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. కాళేశ్వరం, వేయిస్తంభాల దేవాలయాల్లో సుమారు లక్షమంది భక్తులు దేవుని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.
దీనికి తగిన ఏర్పాట్లు చేశారు.నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు వేశారు. భక్తులు క్యూ లైన్ లో వెళ్లి దైవదర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాటు చేశారు. మంచినీరు, మరుగుదొడ్లు, పార్కింగ్(parking) సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
వేయిస్తంభాల ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో (Eo)శేషగిరి రావు, భద్రత ఏర్పాటు చేసిన హనుమకొండ సీఐ. శ్రీనివాస్ , పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
ట్రాఫిక్‌ను (Traffic) మల్లించారు. కాళేశ్వరం ఈవో మహేష్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు.
శివాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. లోపల పూలతో అలంకరించారు. భక్తుల రద్దీతో ఆలయాలన్నీ ఉత్సవ వాతావరణం నెలకొంది.
సౌకర్యాల కొరతతో భక్తుల ఇబ్బందులు
భక్తుల సంఖ్యకు తగిన స్థాయిలో ఏర్పాట్లు లేవని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీల(Vip) తాకిడితో గంటలకొద్ది క్యూ లైన్ లోనే ఉండాల్సి వస్తుందని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులతో వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు.
ఆలయాలకు మహర్ధశ: మంత్రి ఎర్రబెల్లి
(Yadadri)యాదాద్రి, వేములవాడ, కొండగట్టును గత పాలకులు పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (DayakarRao)అన్నారు. స్వరాష్ట్రంలో వందల కోట్లతో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నదన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నాటి కాకతీయుల స్ఫూర్తి తోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సీఎం (CM)కెసిఆర్ కల్పిస్తున్నారని చెప్పారు.