హైద‌రాబాద్‌లో గ‌త ఒక్క ఏడాదే.. ల‌క్ష మందిపై డ్రంక్ డ్రైవ్ కేసులు

గ‌డిచిన సంవ‌త్స‌రంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే మద్యం తాగి వాహనాలు నడిపినందుకు ల‌క్ష మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు

  • Publish Date - January 3, 2024 / 09:04 AM IST

2023లో 5,032 మందికి జైలు

4,000 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను

సస్పెండ్ చేసిన ఆర్టీఏ అధికారులు


విధాత‌: గ‌డిచిన సంవ‌త్స‌రంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే మద్యం తాగి వాహనాలు నడిపినందుకు ల‌క్ష మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మ‌రో 5,032 మందికి జైలు శిక్ష ప‌డింది. తాజాగా డిసెంబర్ 31వ‌ రాత్రి ఒక్క‌రోజే రాష్ట్ర పోలీసులు దాదాపు ఐదు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు న‌మోదు చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసు బృందాలు నిత్యం రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయ‌ని అనేక గ‌ణాంకాల్లో వెల్ల‌డైంది. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన‌ప‌డ‌కుండా ఉండ‌టానికి నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల‌ను పోలీసులు పెద్ద సంఖ్య‌లో నిర్వ‌హిస్తున్నారు.

గ‌త ఏడాది కేవ‌లం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలోనే పోలీసులు 1.06 లక్షల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు న‌మోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు మొత్తం 5,032 మందికి కోర్టులు జైలుశిక్ష విధించాయి. దాదాపు 4,000 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆర్టీఏ అధికారులు సస్పెండ్ చేశారు.

2023లో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు

హైదరాబాద్ – 37,866

సైబరాబాద్ – 52,124

రాచకొండ – 16,594

డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్ -556

సైబరాబాద్ – 500

రాచకొండ – 2,900

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష

హైదరాబాద్ – 3,782

సైబరాబాద్ – 979

రాచకొండ – 271.

Latest News