Tollywood | 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘అఖండ 2’కు చోటు దక్కుతుందా?

Tollywood | 2025 చివరి నెలకు వచ్చేశాం. మరో రెండు వారాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్న వేళ, టాలీవుడ్‌లో ఈ ఏడాది విడుద‌లైన చివరి భారీ సినిమా ‘అఖండ 2’ . ఏడాది ముగుస్తున్న నేప‌థ్యంలో 2025లో విడుదలైన తెలుగు సినిమాలపై రివ్యూలు, విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. గత 12 నెలల్లో స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, భారీ బడ్జెట్ చిత్రాలు నుంచి చిన్న సినిమాల వరకు అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి

Tollywood | 2025 చివరి నెలకు వచ్చేశాం. మరో రెండు వారాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్న వేళ, టాలీవుడ్‌లో ఈ ఏడాది విడుద‌లైన చివరి భారీ సినిమా ‘అఖండ 2’ . ఏడాది ముగుస్తున్న నేప‌థ్యంలో 2025లో విడుదలైన తెలుగు సినిమాలపై రివ్యూలు, విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. గత 12 నెలల్లో స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, భారీ బడ్జెట్ చిత్రాలు నుంచి చిన్న సినిమాల వరకు అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఈ ఏడాది థియేటర్లలో సందడి చేశారు. కొందరికి బ్లాక్‌బస్టర్లు దక్కితే, మరికొందరికి నిరాశే ఎదురైంది. సోషల్ మీడియా, ట్రేడ్ వర్గాల లెక్కల ఆధారంగా 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన టాప్-10 తెలుగు సినిమాల లిస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

1. OG (ఓజీ)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘ఓజీ’ ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా నిలిచింది. దసరాకు విడుదలైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.308 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి 300 కోట్ల సినిమా ఇదే.

2. సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కేవలం తెలుగులోనే రూ.303 కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిందని మేకర్స్ తెలిపారు.

3. గేమ్ చేంజర్

రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా మారింది. అయినప్పటికీ వరల్డ్‌వైడ్‌గా రూ.195 కోట్ల గ్రాస్ రాబట్టి మూడో స్థానంలో నిలిచింది.

4. మిరాయ్

తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘మిరాయ్’ పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు సాధించింది. మేకర్స్ ప్రకారం ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ అందుకుంది.

5. కుబేర

ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన శేఖర్ కమ్ముల సినిమా ‘కుబేర’ జూన్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ.137 కోట్ల గ్రాస్ సాధించింది.

6. డాకు మహారాజ్

బాలకృష్ణ – బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ఈ యాక్షన్ మూవీ ఆశించిన స్థాయిలో నిలవలేకపోయినా, రూ.122 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాప్-10లో చోటు దక్కించుకుంది.

7. HIT 3: ది థర్డ్ కేస్

నాని హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ పాన్ ఇండియా రిలీజ్‌తో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మొత్తం మీద రూ.116–120 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

8. హరి హర వీరమల్లు

పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా కూడా పవర్ స్టార్ క్రేజ్‌తో రూ.112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

9. తండేల్

నాగ చైతన్య కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల సినిమా ఇదే. ‘తండేల్’ వరల్డ్‌వైడ్‌గా రూ.100+ కోట్ల గ్రాస్ సాధించి 9వ స్థానంలో నిలిచింది.

10. కింగ్డమ్

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందన పొందింది. ట్రేడ్ లెక్కల ప్రకారం రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

‘అఖండ 2’ ఈ లిస్ట్‌లో చేరుతుందా?

డిసెంబర్ 12న విడుదలైన బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ ‘అఖండ 2’ తొలి రోజే రూ.59 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. 2025లో విడుదలైన చివరి పెద్ద సినిమా కావడంతో, ఈ చిత్రం టాప్-10 లిస్ట్‌లో చోటు దక్కించుకుంటుందా? లేదా అన్నది రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆధారపడి తేలనుంది. హిట్టా.. ఫ్లాపా.. అనే ఫైనల్ తీర్పు ఈ వీకెండ్‌తో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Latest News