విధాత : ఓ జ్యువెలరీ షాపు యజమాని గొప్ప మనసు చాటుకున్నారు. తన దుకాణంలో పని చేస్తే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. దీపావళి పండగును పురస్కరించుకొని.. ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా అందజేశారు. తమపై అభిమానంతో కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చిన యజమానికి ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో చలానీ జ్యువెలరీ దుకాణాన్ని జయంతి లాల్ అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా జయంతి లాల్ మాట్లాడుతూ.. ఉద్యోగుల జీవితాల్లో దీపావళి పర్వదినం వేళ వెలుగులు నింపాలి అనుకున్నాను. ఇక తమ దుకాణంలో పని చేసే ఉద్యోగులకు 10 కార్లు, 20 బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాను. సిబ్బందిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తన లాభనష్టాల్లో వారు కూడా పాలుపంచుకుని, అండగా నిలబడుతున్నారని జయంతి లాల్ పేర్కొన్నారు.
ఉద్యోగులందరిని తన కుటుంబంగా భావిస్తానని తెలిపాడు. అందుకే ఈ దీపావళికి వారికి సర్‌ప్రైజ్ ఇచ్చానని స్పష్టం చేశాడు. ప్రతి యజమాని కూడా తన సిబ్బందిని గౌరవించాలన్నారు. దీపావళి గిఫ్ట్ కింద కొనుగోలు చేసిన కార్లకు, బైక్‌లకు రూ. 1.2 కోట్లు ఖర్చు అయిందని పేర్కొన్నారు.