Padi Kaushik Reddy | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) హుజురాబాద్( Huzurabad ) నియోజకవర్గంలో తప్పకుండా భారత్ రాష్ట్ర సమితి( BRS Party ) జెండాను ఎగురవేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను భారీ మెజార్టీతో గెలిచి, ఈటల రాజేందర్( Etala Rajender )ను ఇంటికి పంపిస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా పాడి కౌశిక్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హుజురాబాద్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని కేటీఆర్ ఆదేశించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని, ఈటల రాజేందర్‌ను ఇంటికి పంపిస్తానని తెలిపారు. ఇక తనకు విప్‌గా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు.