Pakistan |
విధాత: దయాది దేశంలో పాక్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీగా పెరుగుతున్న ధరలతో జనం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలోనే పిండి కోసం వెళ్లి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాక్‌లోని కరాచీలో చోటు చేసుకున్నది.
రంజాన్ సందర్భంగా ఉచితంగా పిండిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రంలో తొక్కిసలాటలో మహిళలతో పాటు పిల్లలతో పాటు 12 మంది చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
అదే సమయంలో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పిండిని పంపిణీ చేస్తున్న సమయంలో గత వారంలో పంజాబ్ ప్రావిన్స్‌లో కొన్ని తొక్కిసలాట సంఘటనలు కూడా జరిగాయి. వీటిలో కూడా 12 మంది చనిపోయారు.
అయితే, విద్యుత్ తీగను కొందరు తొక్కారని, ఆ తర్వాత ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు సమీపంలో ఉన్న కాలువలో పడిపోయారని పోలీసులు పేర్కొన్నారు. తాజాగా కరాచీలో జరిగిన ఘటనతో పిండికోసం జరిగిన తొక్కిసలాటల్లో ఇప్పటి వరకు 24కు చేరింది.