Site icon vidhaatha

Patriotic Police Dog। పోలీస్‌ జాగిలం దేశభక్తికి నెటిజన్లు ఫిదా

జాగిలాలకు ఇచ్చే తర్ఫీదు ఒక రేంజ్‌లో ఉంటుంది! అలాంటిదే ఒక సుశిక్షిత జాగిలం (Trained Police Dog) రెండు మూడు దేశాల చిత్ర పటాలను దాటుకుని వచ్చి.. భారత దేశ చిత్ర పటాన్ని (India Map) గుర్తించి ఆగటమే కాకుండా.. ముందరి కాళ్లు గౌరవసూచకంగా ఎత్తడం (Salute) నెటిజన్ల ప్రశంసలందుకుంటున్నది. దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది.

Patriotic Police Dog । పోలీస్‌ ట్రైనింగ్‌ శిబిరంలో ముందుగా ఒక జాగిలం పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌, జర్మనీ, భారత్‌, చైనా దేశ చిత్రపటాలు ఉంచిన మట్టిని వాసన చూస్తూ వెళుతుంది.. మరోసారి ఆయా దేశాల చిత్రపటాలను చూస్తూ ముందుకు వస్తుంటే.. భారతదేశ చిత్రపటం ఉంటుంది.

ఆ మట్టిని వాసన చూసిన జాగిలం.. అక్కడే కూర్చొని, తన ముందరి కాళ్లను గౌరవ సూచకంగా పైకెత్తి వందనం చేస్తుంది. జాగిలం టాలెంట్‌ చూసిన నెటిజన్లు (Netizens) సెభాష్‌, వావ్‌, బ్యూటిఫుల్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ్యాప్‌ను సునిశితంగా గమనించిన ఒక నెటిజన్‌.. పాకిస్థాన్‌ మ్యాప్‌లో భారత భూభాగం కూడా కలిసి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. మనం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (Pakistan Occupied Kashmir)గా చెప్పే ప్రాంతాన్ని పాకిస్థాన్‌ తన భూభాగంగా ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే.

Exit mobile version