విధాత, సినిమా: మలయాలకుట్టి మీరాజాస్మిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2001లో మలయాళంలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర, బాలకృష్ణతో మహారధి, విశాల్ పందెం కోడి, రాజశేఖర్ గోరింటాకు వంటి చిత్రాలలో హీరోయిన్‌గా చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది.
కన్నడలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. చివరగా తెలుగులో మోక్ష అనే చిత్రంలో కనిపించింది. తిరిగి గత ఏడాది మకల్ అనే మలయాళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ ఛాన్సుల కోసం తెగ ట్రై చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో బ్యాక్ టు తెలుగు సినిమా అని పోస్ట్ పెట్టింది. అందులో డబ్బింగ్ చెబుతూ కనిపించింది.
అయితే ఆ సినిమా ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇది చూసిన అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. 2013 తర్వాత తెలుగులో నటించకపోయినా అడపాదడపా మలయాళ చిత్రాలలో కనిపిస్తూ వచ్చింది.
ఇదిలాఉంటే మొదట్లో గర్ల్ నెక్ట్స్ టోర్, పక్కింటి అమ్మాయి వంటి వస్థ్రధారణలతో ఎక్స్‌ఫోజింగ్‌కు దూరంగా ఉన్న మీరా జాస్మిన్ గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అవడంతోనే హట్ హట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇది చూసిన వారంతా ఔరా.. మీరా అంటు నోరెళ్లబెట్టారు. మళ్లీ అవకాశాల కోసమే ఇలా హట్ ఫోటోలు షేర్ చేస్తుందంటూ ప్రచారం జరిగింది.
తాజాగా ఆమె బ్యాక్ టు తెలుగు సినిమా అని పోస్ట్ పెట్టడంతో ఇది నిజమేనని ఖరారయింది. మొత్తానికి సీనియర్ హీరోలకు, యంగ్ స్టార్ హీరోల చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఈమె సరిగ్గా సెట్ అవుతుందని కామెంట్లు వస్తున్నాయి.