vvవిధాత: అమెరికాలోని నెవడాలో ఘోరం జరిగింది. ఓ విమానం భూమిని ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో పైలట్ మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనను కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, వైరల్ చేశారు.
నెవడాలోని రేనో స్టీడ్ ఎయిర్‌పోర్టులో ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో రేనో ఎయిర్ రేస్ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీల్లో భాగంగా చివరి రోజు.. ఓ మూడు విమానాలు గాల్లోకి ఎగిరాయి. దీంట్లో ఒక విమానం అతి వేగంతో భూమిని ఢీకొట్టింది. దీంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పైలట్ మృతి చెందాడు.
మిగతా విమానాలను సేఫ్‌గా ల్యాండ్ చేశారు. విమానం భూమిని ఢీకొట్టిన భయానక దృశ్యాలను కొందరు మొబైల్స్ చిత్రీకరించి వైరల్ చేశారు. అయితే మృతి చెందిన పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది.