Site icon vidhaatha

BRS తొత్తులుగా మారిన పోలీసులు: బండి సంజయ్

కమలాపురం (Kamalapuram) మండలం పంగిడిపల్లి గ్రామంలో గత కొద్దిరోజుల క్రితం జరిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay)తనదైన శైలిలో స్పందించారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించి, అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారని దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీసులు బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా మారారని రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోతోందనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంగిడిపల్లి సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ (Enquiry) చేపట్టి స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

హనుమకొండ(Hanumakonda) జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధి కమలాపూర్‌లోని ఈటల రాజేందర్ (Etalage Rajender) నివాసంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా జైలుకు వెళ్లి విడుదలై వచ్చిన ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమలాపూర్ మండలం పంగిడి పల్లె గ్రామంలో ఈటెల పరామర్శల సందర్భంగా కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్(BRS) గుండాలు దాడి చేయడం రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. 326 సెక్షన్ కింద కేసు పెడితే కనీసం ఎటువంటి ఆయుధాలను రికవరీ చేయలేదని గుర్తుచేశారు. కనీసం ఎంక్వైరీ చేయలేదన్నారు.

టాస్క్ ఫోర్స్(Taskforce) సీఐ వెంకటేశ్వర్లు ఎవరికి పని చేస్తున్నావ్ సిగ్గు ఉండాలి. టాస్క్ఫోర్స్ సీఐ నువ్వు ఎవరిని కొడతావ్ విచక్షణ లేకుండా దాడి చేసిన వారిని వదిలి, కాపాడిన వారిపై కేసులు చేస్తావా అంటూ బండి ప్రశ్నించారు.

పోలీసులారా మీరు ముఖ్యమంత్రి(CM) కుటుంబం మెప్పు పొందాలి అంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చీ కొడతారని ఆయన మండిపడ్డారు. ఎన్ని రోజులు ఉంటది ఈ ప్రభుత్వం, బిచ్చపు బ్రతుకు అవతది మీది. బీజేపీ పార్టీ ఎవర్ని వదలదు.ప్రతి ఒక్కరి అంతుచూస్తది. ఇప్పటికైనా ఈ విషయం మీద వరంగల్ సీపీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పోటుగాడు అని వాళ్ళ చుట్టాలు, కొడుకు, బిడ్డలు, అల్లుల్లు వస్తే మూడు రోజుల ముందే బీజేపీ లీడర్లను అరెస్ట్ (Arrest) చేస్తారా అని సంజయ్ నిలదీశారు.

డబ్బులతో ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎమ్మెల్యే ఈటలను భారీ మెజారిటీతో (mejarity) గెలిపించడంతో అధికార పార్టీకి డప్పులు కొట్టాయని బండి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగా వందల కోట్లు పెట్టలేదు. దొంగ ఓట్లు వేయించుకోని ఈటెల గెలవలేదని సంజయ్ అన్నారు.

టీఆర్ఎస్ నాయకులు, గుండాలు ఎమ్మెల్సీ, లీడర్లు చెప్తే మా నాయకుడు ఈటెల రాజేందర్ కాన్వాయ్‌కి బండ్లు అడ్డం పెట్టారని బీజేపీ కమలాపూర్ నాయకుడు అమరేందర్ వివరించారు.రాత్రికి, రాత్రే మమ్మల్ని అరెస్ట్ చేశారని, కమలాపూర్ ఎస్ఐ సతీష్ నన్ను కావాలని అరెస్ట్ చేశారని చెప్పారు. కావాలంటే అతడికి పింక్ డ్రెస్ (pink dress)కొనిస్తా, వేసుకొని రాజకీయాలకు రమ్మను అంటూ సవాల్ విసిరారు. మాపై తప్పుడు ఆరోపణలు చేసి విపరీతంగా కొట్టారనీ, నా దగ్గర 50వేల రూపాయల డబ్బులు లంచం కూడా అడిగాడని ఆరోపించారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి, బీజ‌పీ జిల్లా అధ్యక్షురాలు రావు, పద్మ, రాష్ట్ర నాయకులు ఏనుగు రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.

Exit mobile version