Site icon vidhaatha

Komatireddy Venkat Reddy | ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు

విధాత: పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్(Sudhakar)ను, ఆయన కొడుకు డాక్టర్ సుహాస్ (Suhas)ని చంపేస్తానని బెదిరించిన వివాదంలో ఐపీసీ 506 కింద ఎంపీ కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) పై పోలీసులు కేసు నమోదు చేశారు.

చెరుకు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్గొండ(Nalgonda) పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఒకే పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న పంచాయతీ భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ అధిష్టానం వారి వివాదంపై ఏ విధంగా స్పందిస్తారని ఆసక్తికరంగా మారింది.

Exit mobile version