Site icon vidhaatha

CPR నిర్వహించి ప్రాణం కాపాడిన రేగొండ పోలీసులు (Video)

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీపీఆర్ నిర్వహించి ప్రాణాపాయ స్థితి నుంచి ఒక వ్యక్తిని రేగొండ పోలీసులు (Regonda Police) కాపాడారు. భూపాల్‌పల్లి జిల్లా రేగొండ మండల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు మీద రజాక్ చికెన్ సెంటర్‌లో పని చేసే వంశీ అనే వ్యక్తి బుధవారం రాత్రి హార్ట్ ఎటాక్ (Heart attack) వచ్చి పడిపోయాడు.

కాగా.. పక్కనే ఉన్న బ్లూ కోల్డ్ పోలీస్ (Blue Cold Police) సిబ్బంది, కానిస్టేబుల్ కిరణ్ వెంటనే ఆ వ్యక్తికి సీపీఆర్ నిర్వహించారు. దీంతో వంశీ 15 నిమిషాల తర్వాత తిరిగి శ్వాస తీసుకోవడంతో ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి (SI Srikanth Reddy) తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

ఇతర సిబ్బంది హెచ్‌సీ రాజేశ్వరరావు శ్రీశైలం, కుమార్ లు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న ప్రజలు పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Exit mobile version