Site icon vidhaatha

TSLPRB : 11న పోలీస్‌ టెక్నికల్‌ విభాగం తుది రాత పరీక్షలు

Police Technical Section Final Written Exams

విధాత‌: ఎస్ ఐ, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో భాగంగా టెక్నికల్‌ విభాగాలకు సంబంధించిన తుది రాత పరీక్షలు ఈ నెల 11న జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB ) గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్‌ ((IT & CO) విభాగం ఎస్ ఐ తుది పరీక్ష 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో ( (FPB) ఏఎస్ ఐ తుది పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.

అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి 9 వ తేదీ రాత్రి 12 గంటల వరకు TSLPRB కి సంబంధించిన వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని మండలి ఛైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించుకోవాలని సూచించారు.

డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే e-mail to support@tslprb.in or contact us on 93937 11110 or 93910 05006 నంబర్లలో సంప్రందించాలన్నారు. SCT SI (IT & CO), SCT ASI (FPB) తుది రాతపరీక్షకు సంబంధించిన మరో రెండు పేపర్ల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే తేదీలను మళ్లీ ప్రకటిస్తామని చైర్మన్‌ వెల్లడించారు.

Exit mobile version