IQ Air Report | ప్రపంచానికి పొల్యూషన్‌ ముప్పు.. అత్యంత కాలుష్య దేశాల జాబితాలో 8వ స్థానంలో భారత్‌..!

IQ Air Report | దేశంలో కాలుష్య రోజురోజుకు పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నది. భారత్‌లో గతంలో పోలిస్తే కాలుష్యం కొంత మెరుగుపడింద స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ పేర్కొంది. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌-2022ను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా టాప్‌ కాలుష్య దేశాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ 8వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో గతంలో ఐదవ స్థానంలో ఉండగా.. ఈ సారి […]

  • Publish Date - March 15, 2023 / 02:40 AM IST

IQ Air Report | దేశంలో కాలుష్య రోజురోజుకు పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నది. భారత్‌లో గతంలో పోలిస్తే కాలుష్యం కొంత మెరుగుపడింద స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ పేర్కొంది. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌-2022ను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా టాప్‌ కాలుష్య దేశాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ 8వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో గతంలో ఐదవ స్థానంలో ఉండగా.. ఈ సారి 8వ స్థానానికి పడిపోయి ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నది.

అత్యంత కాలుష్య నగరాల జాబితాలో 50 నగరాల్లో 39 భారత్‌లోనే ఉన్నాయి. 131 దేశాల నుంచి డేటాను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఐక్యూఎయిర్‌ నివేదికను విడుదల చేసింది. తర్వాత సంస్థ తన నివేదికను విశ్లేషించింది. టాప్‌ పొల్యూషన్‌ దేశాల్లో చాద్‌ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇరాక్, పాకిస్థాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బుర్కినా ఫాసో, కువైట్, భారత్‌, ఈజిప్ట్ అండ్‌ తజికిస్థాన్ అత్యంత కాలుష్య దేశాల జాబితాలో టాప్‌ టెన్‌లో నిలిచాయి. ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రెనడా, ఐస్లాండ్, న్యూజిలాండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన PM2.5 గైడ్ లైన్‌ని చేరాయి.

భారతదేశంలో PM2.5 కాలుష్యంలో దాదాపు 20-35 శాతం రవాణా రంగమే కారణంగా నిల్తున్నది. పారిశ్రామిక యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, బయోమాస్ దహనం తదితర కారణాలతో గాలి నాణ్యత దిగజారుతున్నది. ప్రపంచంలోని టాప్ 50 అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. పాక్‌లోని లాహోర్‌ లాహోర్‌ అత్యంత కాలుష్య నగరంగా నిలువగా.. చైనాలోని హోటాన్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్‌లోని భివాడి మూడో స్థానంలో ఉన్నది.

ఢిల్లీ పీఎం2.5 స్థాయి సురక్షిత పరిమితి కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువని నివేదిక వెల్లడించింది. ఢిల్లీ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఉండగా.. నివేదిక ‘గ్రేటర్’ ఢిల్లీ, న్యూఢిల్లీ రాజధాని మధ్య తేడాను చూపింది. ఈ రెండు నగరాలు కాలుష్యంలో టాప్‌ టెన్‌లో ఉన్నాయి. గత సంవత్సరాల్లో నమోదైన సగటు PM2.5 స్థాయిలతో పోలిస్తే గురుగ్రామ్‌లో 34 శాతం క్షీణతతో ఫరీదాబాద్‌లో 21 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ఎనిమిది శాతం క్షీణించినట్లుగా వివరించింది.

Latest News