ప్రీతి ఆత్మహత్య.. సీనియర్ స్థూడెంట్స్‌కు పవన్ కల్యాణ్ కౌన్సెలింగ్!

విధాత‌: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రీతి తన సీనియర్ విద్యార్థి చేసిన ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సమాజంలో పలు వర్గాలను కదిలించింది.. పోలీసులు, మానసిక విశ్లేషకులు.. డాక్టర్లు ఇలా పలు వర్గాలకు చెందిన మేధావులు స్పందిస్తున్నారు. పిల్లల ప్రవర్తన మీద, తల్లిదండ్రుల బాధ్యత గురించి.. అధ్యాపకుల బాధ్యతలు.. విద్యార్థుల మధ్య ఉండాల్సిన స్నేహపూర్వక బంధం గురించి కూడా పలువురు టివి ఛానెళ్లలో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి మరణంపై జనసేనాని […]

  • Publish Date - February 27, 2023 / 02:24 PM IST

విధాత‌: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రీతి తన సీనియర్ విద్యార్థి చేసిన ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సమాజంలో పలు వర్గాలను కదిలించింది.. పోలీసులు, మానసిక విశ్లేషకులు.. డాక్టర్లు ఇలా పలు వర్గాలకు చెందిన మేధావులు స్పందిస్తున్నారు. పిల్లల ప్రవర్తన మీద, తల్లిదండ్రుల బాధ్యత గురించి.. అధ్యాపకుల బాధ్యతలు.. విద్యార్థుల మధ్య ఉండాల్సిన స్నేహపూర్వక బంధం గురించి కూడా పలువురు టివి ఛానెళ్లలో మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రీతి మరణంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన కాలేజీల్లో సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జూనియర్ విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలని పవన్ సూచించారు.

కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టేవారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకోవాలని కోరారు. జూనియర్లను సీనియర్ విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలన్నారు. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం ఆధిపత్య ధోరణి చూపటం రాక్షసత్వం అవుతుందని అన్నారు.

ఇంకా ఆ ప్రకటనలో ఏం రాశారంటే… ‘వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు కన్నవారి మానసిక వేదన గురించి త‌లుచుకుంటే హృదయం ద్రవించింది.

తమ బిడ్డను సైఫ్ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు సైఫ్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అని పవన్ కోరారు.

కళాశాలల్లో ముఖ్యంగా మెడికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలి’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారీగా గిరిజనులు, విద్యార్థులు తరలిరాగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రీతి అంత్యక్రియలు వారి స్వగ్రామమైన జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండాలో పూర్తి చేశారు.

Latest News