Revanth Reddy। యాత్రలో అదనపు సెక్యూరిటీ క‌ల్పించండి.. హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌

Revanth Reddy, High Court తదుపరి విచారణ సోమవారానికి వాయిదా విధాత: హాత్‌ సే హాత్‌ జోడో(Hath Se Hath Jodo) యాత్ర సందర్భంగా తనకు అదనపు సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ తెలంగాణ (TELANGANA PCC PRESIDENT) పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు (Telangana High Court) విచార‌ణ చేప‌ట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ రేవంత్‌రెడ్డి యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్లు కోర్టుకు వివరించారు. […]

  • Publish Date - March 3, 2023 / 12:08 PM IST

Revanth Reddy, High Court

  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

విధాత: హాత్‌ సే హాత్‌ జోడో(Hath Se Hath Jodo) యాత్ర సందర్భంగా తనకు అదనపు సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ తెలంగాణ (TELANGANA PCC PRESIDENT) పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు (Telangana High Court) విచార‌ణ చేప‌ట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ రేవంత్‌రెడ్డి యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్లు కోర్టుకు వివరించారు.

పాదయాత్రలో భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది ఫ్యాక్స్ కాపీని కోర్ట్‌కు సమర్పించారు. డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Latest News