Site icon vidhaatha

రాహుల్‌పై వేటు.. సెక్షన్‌ 8(3)ను సవాల్‌ చేస్తూ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

విధాత: ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేరళకు చెందిన అభా మురళీధరన్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తక్షణ అనర్హత వేటు అన్నది రాజ్యాంగం విరుద్ధమన్నారు.

అనర్హత పేరుతో రాజకీయాలను సెక్షన్‌ 8 (3) ప్రోత్సహిస్తున్నదని.. ఇది నేరుగా రాజ్యాంగ మూల స్వరూపం పైనే దాడి చేస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది దేశ ఎన్నికల వ్యవస్థకు అశాంతిని కలిగిస్తుందని తెలిపారు.

ఈ పిటిషన్‌ శుక్రవారం రాత్రి దాఖలు కాగా వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌గాంధీపై లోక్‌సభ కార్యాలయం అనర్హత వేటు వేసిన వేళ ఆ చట్టాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలుకావడం గమనార్హం.

Exit mobile version