- మహారాష్ట్ర పుణెలోని ఎరవాడ సెంట్రల్
- జైలులో రెచ్చిపోయిన 12 మంది ఖైదీలు
- నిరుడు ఇదే తరహా దాడిలో ఓ ఖైదీ మృతి
Pune | విధాత: మహారాష్ట్ర పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఖైదీలు రెచ్చిపోయారు. ఏకంగా జైలర్‌పైనే 12 మంది ఖైదీలు దాడికి తెగబడ్డారు. గురువారం ఉదయం జరిగిన ఈ దాష్టిక ఘటనలో జైలర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మణికట్టు విరగడంతోపాటు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి దారితీసిన పరిస్థితులు ఏమిటనేది అధికారులు వెల్లడించలేదు.
జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎరవాడ సెంట్రల్ జైలులో జైలర్‌గా షెర్ఖాన్ పఠాన్ విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఉదయం కూడా విధుల్లో భాగంగా రౌండ్స్ వేస్తుండగా ఈ దాడి జరిగింది. “జైలు సర్కిల్ I ప్రాంతంలో పఠాన్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఖైదీలు ప్రకాశ్ రేనూస్, వికీ కాంబ్లే , మరో 10 మంది జైలర్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. దర్యాప్తు జరుగుతున్నది” అని అధికారులు తెలిపారు.
2023 డిసెంబర్‌లో ఇదే ఎరవాడ జైలులో ఉన్న 27 ఏండ్ల అండర్ ట్రయల్ ఖైదీపై నలుగురు ఖైదీలు దాడికి పాల్పడ్డారు. పాత కక్షల కారణంగా మూకుమ్మడిగా జరిపిన దాడిలో యువ ఖైదీ మరణించాడు.