- ప్రశ్నించే గొంతు నొక్కుతున్న బిజెపి ప్రభుత్వం
- ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క
- ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ దీక్షలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆదానీపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్‌గాంధీ పై అనర్హత వేటు వేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని భయం పట్టుకుందని రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు. మోదీ, అమిత్ షా లు డొల్ల కంపెనీలతో ఆదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టారని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే అడ్డుకున్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని అన్నారు.
ఆదానీ ఇంజన్ కు రిపేరు వచ్చిందని ప్రధానికి భయం పట్టుకుందన్నారు. పప్పు అని అవహేళన చేసిన బీజేపీకి రాహుల్ నిప్పు అని తెలుసుకున్నారని… అందుకే రాజకీయ కక్షతో అడ్డు తొలగించు కోవాలనుకున్నారని రాహుల్‌ను చూసి మోదీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బిజెపి అదానీకి కట్టబెడుతుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన ఆరోపించారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మల్లాడి రాం రెడ్డి, టిపిసిసి కార్యదర్శి పైడా కుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, కంబాల రవి, ఎండీ చాంద్ పాషా,చెన్నోజు సూర్య నారాయణ
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి బండి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
హనుమకొండలో కాంగ్రెస్ నిరసన దీక్ష
దేశాన్ని బీజేపీ, ఆదానీ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హనుమకొండలో సోమవారం ఒకరోజు దీక్ష నిర్వహించారు. సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.
ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని తెలిపారు. పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని చెప్పారు.
ఈ నిరసన దీక్షలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ & పిసిసి సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్లో
వరంగల్ స్టేషన్ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ నల్గొండ రమేష్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, టీపీసీసీ కార్యదర్శి కొత్తపెళ్లి శ్రీను,కుచన రవీందర్, ఎర్రం కమల్, పోలేపాక విశాల్ బాబు, చెరుకు సందీప్, మడిపెల్లి కృష్ణ, చిప్ప వెంకటేశ్వర్లు, కక్కెర్ల ప్రభాకర్,గజ్జెల లింగమూర్తి, చిట్టీమల్ల శ్రీను,రేణుకుంట్ల శివ,దాసరి రాజేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.