Site icon vidhaatha

Rahul Gandhi | రేపు సూరత్‌కు రాహుల్‌ గాంధీ..! రెండేళ్ల జైలుశిక్షను సవాల్‌ చేయనున్న కాంగ్రెస్‌ నేత..!

Rahul Gandhi | కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం సూరత్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్షపై సూరత్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు సీజేఎం కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన సూరత్‌కు చేరుకొని పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తున్నది.

మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్‌కు వ్యతిరేకంగా గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ పరువునష్టం కింద కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. రాహుల్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రోజు రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version