Site icon vidhaatha

‘పుల్వామా’ అమ‌ర జ‌వాన్ల‌కు రాహుల్ నివాళి

Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జ‌మ్మూ క‌శ్మీర్‌లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా పుల్వామా దాడిలో అమ‌రులైన వీర జ‌వాన్ల‌కు రాహుల్ గాంధీ నివాళుల‌ర్పించారు. 2019, ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామాలో జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

పుల్వామా అమ‌రుల‌కు రాహుల్ నివాళుల‌ర్పించిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. ధైర్య సాహసాలు నిండిన అమరుల రక్తం కలిసిన నేలకు వందనం చేసినట్లు పార్టీ తెలిపింది.

రాహుల్ త‌న పాద‌య‌త్రాను జమ్మూ-కశ్మీర్‌లోని అవంతిపొర నుంచి కొనసాగించారు. ఈ యాత్రలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర ఈ నెల 30న కశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Exit mobile version