Site icon vidhaatha

Rahul Gandhi | ప్రధాని, అదానీపై వ్యాఖ్యలు.. ప్రివిలేజ్‌ నోటీసులపై స్పందించిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi | లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు ప్రివిలేజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై రాహుల్‌ గాంధీ లోక్‌సభ సెక్రెటేరియట్‌కు సవివరంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 7న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీపై పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీతో సంబంధాలపై ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత బీజేపీ ఎంపీలు నిషికాంత్‌ దూబే, ప్రహ్లాద్‌ జోషి ప్రివిలేజ్‌ ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఈ నెల 15లోగా సమాధానం ఇవ్వాలని రాహుల్‌ గాంధీని లోక్‌సభ సెక్రటేరియట్‌ కోరింది. ఈ రాహుల్‌ గాంధీ లోక్‌సబలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించేందుకు పలు చట్టాలను ఉదహరిస్తూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, రాహుల్ చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని రికార్డుల నుంచి తొలగించడంపై ఇప్పటికే రాహుల్‌ గాంధీ బీజేపీ ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. పార్లమెంటులో తాను ఎలాంటి కించపరిచే పదజాలం ఉపయోగించలేదని వయనాడ్‌లో జరిగిన సభలో స్పష్టం చేశారు.

Exit mobile version